కారుకూరి చంద్రమౌళి రూ.1 లక్ష విరాళం
మంచిర్యాల:-కులాభివృద్ధి పట్ల తన బాధ్యతను చాటుకుంటూ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు, పెరిక సంఘం పట్టణ గౌరవ అధ్యక్షులు కారుకూరి చంద్రమౌళి పెరిక భవన్ నిర్మాణానికి చేయూత పెరిక భవన్ నిర్మాణానికి చేయూతముందుకు వచ్చారు. కోకాపేటలో నిర్మాణమవుతున్న పెరిక ఆత్మగౌరవ భవనానికి రూ.1 లక్ష విరాళం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రకటించిన విరాళంలో భాగంగా తొలి విడతగా రూ.50,000ల చెక్కును కులబంధువుల సమక్షంలో మంచిర్యాల జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులు బొడ్డు శంకర్ అందజేశారు. మిగిలిన రూ.50 వేల విరాళాన్ని తదుపరి విడతలో అందించనున్నట్లు తెలిపారు.

పెరిక భవన్ నిర్మాణానికి చేయూత
కోకాపేటలో నిర్మాణమవుతున్న పెరిక ఆత్మగౌరవ భవనం కుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవడంతో పాటు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ భవన నిర్మాణానికి కారుకూరి చంద్రమౌళి తనవంతు సహకారం అందించడం పట్ల పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, గౌరవాధ్యక్షులు మద్దా లింగయ్య కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
శరవేగంగా కొనసాగుతున్న కోకాపేట పెరిక భవన్ పనులు
కోకాపేట పెరిక ఆత్మగౌరవ భవన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఏడవ స్లాబ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ కులబంధువులందరూ ముందుకు వచ్చి తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్ ఆధ్వర్యంలో కులబంధువులు భవన నిర్మాణానికి విరాళాలు అందిస్తూ సహకరిస్తుండటం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో కోకాపేట పెరిక ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్, చుంచు రాజ్ కిరణ్, సింగతి మురళి, బియ్యాల లక్ష్మణ్, పెట్టెం లక్ష్మణ్, బొడ్డు తిరుపతి, అత్తే సరోజ, సంఘ మానయ్య, అక్కల రమేష్, నెల్కి మల్లేష్, బియ్యాల సత్తయ్య, బేరా సత్యం, గొల్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
కోకాపేట పెరిక ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కులబంధువుల నుంచి అందుతున్న విరాళాలు, సహకారం నిర్మాణ పనులకు మరింత ఊపునిస్తున్నాయి.
Recent Post:-
కోకాపేట పెరిక ఆత్మగౌరవ భవనానికి త్వరలో ప్రభుత్వ నిధులు: మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
Workout Routine for Men: Complete Weekly Gym Plan for Strength and Fitness











Leave a Reply